మితిమీరిన రాజకీయ జోక్యంతో అప్పుల పాలవుతున్న సింగరేణి

– ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కె. వీరభద్రయ్య
మితిమీరిన రాజకీయ జోక్యంతో సింగరేణి సంస్థ అప్పుల పాలవుతుందని ఏఐటీయూసీ ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కె.  వీరభద్రయ్య అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ1  గని పై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ గత ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలుపొందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చేతగానితనం వల్ల సింగరేణి సంస్థ కు వచ్చిన లాభాలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చేరుతున్నాయన్నారు. కార్మికులకు జీతాలు చెల్లించడానికి యాజమాన్యం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసిన పరిస్థితి నెలకొందన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వైఫల్యం కారణంగానే సింగరేణి సంస్థకు రావాల్సిన 29 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. ఈనెల 28న జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలు వాయిదా పడటానికి రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం, తెబొగకాసం, ఇతర 11 కార్మిక  సంఘాలేనని విమర్శించారు. కార్మికులు తమ సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్తే యాజమాన్యం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, తెబొగకాసం వైఫల్యం కారణంగానే కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించని  యెడల ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని యాజమాన్యాన్ని హెచ్చరించారు.  ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, సంయుక్త కార్యదర్శి రాచర్ల చంద్రమోహన్, ఏరియా కార్యదర్శి కామర వేణు, పిట్ కార్యదర్శి దాడి రాజయ్య, మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ మారేపల్లి బాపు, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు మోతె లచ్చయ్య, అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment