యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి

  • శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ కుమార్

ఆర్.కె న్యూస్, నస్పూర్: యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని శ్రీరాంపూర్ ఎస్సై సంతోష్ కుమార్ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఐటిఐలో నిర్వహించిన యాంటీ డ్రగ్ అవగాహన సదస్సులో శ్రీరాంపూర్ ఎస్సై మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని, మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. డ్రగ్స్ మాయలో పడి యువత తమ శక్తి యుక్తులను వృధా చేసుకోకూడదని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని యువత సోషల్ స్టేటస్, ఫ్యాషన్ గా బావిస్తున్నారని, విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. మాదక ద్రవ్యాలు సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల   ఆత్మహత్య ఆలోచనలు సైతం కలగడం, తమను తాము గాయపరచుకోవడంతో పాటు ఇతరుల పై దాడులు, హత్యలు, దొంగతనాల వంటి నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని అన్నారు. యువత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పిన సూచనలు పాటిస్తూ ఉన్నత స్థానంలో స్థిరపడాలన్నారు. డ్రగ్స్‌ వినియోగించే, విక్రయిస్తున్న వారి సమాచారం పోలీసులకు అందిస్తే చర్యలు తీసుకుంటామని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. గంజాయి అక్రమ రవాణా, సరఫరా, విక్రయించే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని, ఒక్కసారి కేసు నమోదు అయితే ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు రాక భవిష్యత్తు నాశనం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఐటిఐ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment