- శ్రీరాంపూర్ జీఎం బి సంజీవ రెడ్డి
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడానికి కృషి చేయాలని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డి అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 1, ఎస్సార్పీ 3 గనులలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో జనరల్ మేనేజర్ దంపతులు బి సంజీవ రెడ్డి, సేవాధ్యక్షురాలు రాధాకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ అమ్మవారి దీవెనలు ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల పై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఏరియాలో పనిచేస్తున్న ఉద్యోగులకు, అధికారులకు, ప్రజలకు దసరా దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సార్పీ గ్రూప్ గనుల ఏజెంట్ దంపతులు గోపాల్ సింగ్, రష్మీ సింగ్, గుర్తింపు సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ కొమురయ్య, ఎస్సార్పీ 3 గని మేనేజర్ వెంకట్రావు గారు, ఎస్సార్పీ 1, ఎస్సార్పీ 3 గనుల రక్షణాధికారులు రాజేష్ కుమార్, ఈ మహేందర్ , పిట్ కార్యదర్శులు దాడి రాజయ్య, మురళి చౌదరి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.