- క్రమం తప్పకుండా విధులు నిర్వర్తించాలి
- ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్
ఆర్.కె న్యూస్, నస్పూర్: ఉద్యోగులు క్రమం తప్పకుండా విధులు నిర్వర్తించాలని, సంస్థ ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా రక్షణతో కూడిన ఉత్పత్తిలో ఆర్.కె 5 గనిని సింగరేణిలో అగ్రగామిగా నిలపాలని ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ అన్నారు. సోమవారం దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరు అవుతున్న ఆర్.కె 5 గని ఉద్యోగులకు ఆర్.కె 5 గని మేనేజర్ సుధీర్ కుమార్ ఝతో కలిసి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్ సుమారు 30 మంది కార్మికులు విధులకు ఎందుకు గైర్హాజరు అవుతున్నారో అడిగి తెలుసుకున్నారు. సక్రమంగా విధులు నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనాల పై అవగాహన కల్పించారు. రెగ్యులర్ గా డ్యూటీ చేస్తూ మంచి వేతనం పొందడం ద్వారా కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో ఉండవచ్చన్నారు. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. సంస్థ ఉత్పత్తి లక్ష్య సాధనకు ఉద్యోగుల గైర్హాజరు సైతం ఒక ఆటంకంగా మారింది, ఆర్.కె 5 గనిలో 1200 మందిలో కేవలం 800 మంది మాత్రమే రెగ్యులర్ గా విధులకు హాజరవుతున్నారని, 400 మంది గైర్హాజరు అవటం విచారకరమని అన్నారు. వీరిలో 125 మంది 75 మస్టర్లు కూడా చేయలేదని, వారి పరిస్థితుల్లో మార్పు రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్.కె 5 గని రక్షణ అధికారి రాందాస్, సంక్షేమ అధికారి రణదీప్, అడిషనల్ మేనేజర్ శివయ్య, ఫిట్ సెక్రటరీ నర్సింగరావు, యాక్టింగ్ పీఏ శ్రీకాంత్ ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.