రక్షణతో కూడిన ఉత్పత్తి సాధనకు కృషి చేయాలి  

  • శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఉద్యోగులు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూటెక్ గని ఫైవ్ స్టార్ రేటింగ్, 55వ రక్షణ పక్షోత్సవాల్లో ద్వితీయ బహుమతి సాధించిన నేపథ్యంలో శుక్రవారం గనిపై అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులను అభినందించారు. గనిలో పని చేస్తున్న ఉద్యోగుల కృషి, పట్టుదలతో ఆర్.కె న్యూటెక్ గని ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆదర్శంగా నిలవాలని సూచించారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఏరియా కార్యదర్శి ఎస్.కె బాజీ సైదా, గ్రూప్ ఏజెంట్ కె.రాజేందర్, గని మేనేజర్ కురుపాటి శ్రీనివాసు, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, గని రక్షణాధికారి కొట్టె రమేష్, సీనియర్ సంక్షేమాధికారి పాల్ సృజన్, ఇతర అధికారులు, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment