రక్షణతో కూడిన ఉత్పత్తే లక్ష్యం

ఆర్.కె 7 గనిలో ఘనంగా 56వ రక్షణ వారోత్సవాలు
రక్షణ పతాకాన్ని ఆవిష్కరించిన గని మేనేజర్ జె. తిరుపతి

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 7 గనిలో సోమవారం 56వ వార్షిక రక్షణ పక్షోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గని ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గని మేనేజర్ జె. తిరుపతి ముఖ్య అతిథిగా పాల్గొని రక్షణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గని మేనేజర్ జె. తిరుపతి మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు గనిలో రక్షణ పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్.కె 7 గని రక్షణ విభాగంలో గతంలో అనేక ప్రశంసలు, బహుమతులు సాధించిందని గుర్తుచేశారు. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ, రక్షణ విభాగంలో గనికి మరిన్ని బహుమతులు వచ్చేలా కార్మికులు, అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో గనిని సందర్శించనున్న ‘రక్షణ తనిఖీ బృందం’ వారికి గని ఉద్యోగులందరూ సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. వారు ఇచ్చే సలహాలు, సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ, రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించడమే మన అందరి లక్ష్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుర్తింపు సంఘం డిప్యూటీ జనరల్ సెక్రటరీ వీరభద్రయ్య, బ్రాంచ్ ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు హాజరై కార్మికులకు రక్షణ సూత్రాలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో గని రక్షణ అధికారి సంతోష్ రావు, పిట్ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్, పిట్ సెక్రటరీ సారయ్య, అండర్ మేనేజర్లు రవీందర్, రామ్, బాలకృష్ణ, సంక్షేమ అధికారి శాంతన్ తదితర అధికారులతో పాటు సూపర్ వైజర్లు, కార్మికులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment