63
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈ నెల 28న పదవీ విరమణ పొందుతున్న జనరల్ మేనేజర్ (మార్కెటింగ్) డి. రవి ప్రసాద్ సింగరేణి సంస్థకు అందించిన సేవలు వెలకట్టలేనివని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం జనరల్ మేనేజర్ కార్యాలయంలో జీఎం ఎం. శ్రీనివాస్, ఇతర అధికారులు రవి ప్రసాద్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్ మాట్లాడుతూ, రవి ప్రసాద్ సింగరేణిలో వివిధ హోదాల్లో పనిచేసి సంస్థ అభివృద్ధికి కృషి చేశారని, పదవీ విరమణ అనంతరం జీవితం ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో గడపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కె. వెంకటేశ్వర్ రెడ్డి, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఏవీ రెడ్డి, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, డీజీఎం (ఐఈడి) కె. చిరంజీవులు, ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, శ్రీరాంపూర్ గ్రూప్ ఏజెంట్ వెంకటేశ్వర్లు, డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, డీజీఎం (ఏరియా స్టోర్స్) మల్లయ్య, పర్చేజ్ అధికారి చంద్రశేఖర్, ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.