రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు

  • మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  

నస్పూర్, మార్చి 23 (ఆర్.కె న్యూస్): రాజకీయాలు, గెలుపోటములకు అతీతంగా కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి నస్పూర్ పట్టణంలోని ఏవి ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో  మంచిర్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలకు సంబంధం లేకుండా ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా ఇస్తున్నామని, ఉగాది పండుగ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు, అర్హులైన లబ్ధిదారులకు అతి త్వరలో నూతన తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తున్నట్లు, మిగిలిన హామీలను కూడా అమలు చేస్తామని తెలిపారు. మంచిర్యాల నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 1500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులను కమీషన్ల కొరకు ఎవరైనా వేధిస్తే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని, 3 నెలల్లో సింగరేణి భూముల సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని అవాంతరాలు సృష్టించిన మంచిర్యాలలో అభివృద్ధి ఆగదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో హిందూ, ముస్లిం, క్రిష్టియన్లు అందరూ సమానమే అని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురిమిళ్ళ వేణు, నాయకులు నూకల రమేష్, భూపతి శ్రీను, తిరుపతి, కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment