రాజకీయ నాయకుల చేతిలో బందీగా సింగరేణి సంస్థ

– రాబోయే ఎన్నికల్లో ఏఐటీయూసీని గెలిపించాలి
– ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య
సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం మితిమీరి పోయిందని, సింగరేణి సంస్థ రాజకీయ నాయకుల చేతిలో బందీగా మారిందని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనిలో ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ  రాజకీయ జోక్యంతో ఆర్థిక దోపిడీ పెరిగి సంస్థ అప్పుల పాలయ్యే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని 1998కి ముందు ఏఐటీయూసీ అడగలేదని కొన్ని యూనియన్ల వల్ల సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చాయని గుర్తు చేశారు. సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ జోక్యం పెరిగి కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణికి దాదాపు 29 వేల కోట్ల రూపాయలు బకాయిలు రావాల్సి ఉందని వాటిని ఇప్పటివరకు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల కార్మికుల జీతాలు ఏరియర్స్ చెల్లింపుల కోసం యాజమాన్యం బ్యాంకుల చుట్టూ యాజమాన్యం  తిరగాల్సి వస్తోందని ఆరోపించారు.   అధికారుల కంటే కార్మికులకు 11వ వేజ్ బోర్డు ఒప్పందం వల్ల కార్మికుల జీతాలు అధికారుల జీతం కంటే ఎక్కువ పెరిగాయని ఇది డిపిఈ గైడ్ లైన్స్ కు వ్యతిరేకమని కోల్ ఇండియాలోని అధికారుల సంఘం జబల్పూర్ హైకోర్టులో కేసు వేయడంతో అక్కడి కార్మికులకు జీతాలు చెల్లింపు నిలిపారని, అధికారుల సంఘం వెంటనే కోర్టు కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జాతీయ సంఘాలు ఈనెల 12, 13, 14 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయని తెలిపారు. కోలిండియా యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతుందని , ఈ కోర్టు కేసులో సింగరేణి పార్టీ కాలేదని, కార్మికుల జీతాలు చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసిన సింగరేణి యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రావడం లేదని అన్నారు. కోర్టు తీర్పు మేరకు గత నెల 27న డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ ని విడుదల చేశారని, షెడ్యూల్ ప్రకారం యాజమాన్యం ఎన్నికలు నిర్వహించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్మిక వర్గం ఏఐటీయూసీని గెలిపించాలని, సంస్థ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.కె బాజీ సైదా, జాయింట్ సెక్రటరీ రాచర్ల చంద్రమోహన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, నాయకులు  మోహన్ రెడ్డి, నర్సింగ రావు, ఇతినేని శంకర్, సత్తయ్య, గండి సతీష్, సుధాకర్, సుభాష్, భీమయ్య, దొడ్డిపట్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment