రాజకీయ లక్ష్యంతోనే కుల సంఘాలు బలోపేతం

-జిల్లా స్థాయి మున్నూరు కాపు క్యాలెండర్ ఆవిష్కరణ
-మున్నూరు కాపు సంఘం పటేల్స్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం
ఆర్.కె న్యూస్, నస్పూర్:  తెలంగాణాలో అత్యధికంగా ఉన్న మున్నూరు కాపులు ఐక్యతతో ముందుకు సాగాలని, రాజకీయ లక్ష్యంతోనే కుల సంఘాలు బలోపేతం అవుతాయని తెలంగాణ మున్నూరు కాపు సంఘం (పటేల్స్) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ ప్రెస్ క్లబ్ లో మున్నూరు కాపు సంఘం జిల్లా అధికార ప్రతినిధి భాస్కరి రాజేశం అధ్యక్షతన జిల్లా మున్నూరు కాపు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా స్థాయి మున్నూరు కాపు సంఘం క్యాలెండర్ ను  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బోరిగం రాజారాం, యూత్ జిల్లా అధ్యక్షుడు శ్రీపతి సురేష్ లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్నూరు కాపులు ఐఖ్యకంగా ఉంటే రాజకీయంగా రాణించ గలుగుతారన్నారు. రాజకీయ చైతన్యం, ఐఖ్యతతోనే సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందుతారని అన్నారు. రానున్న మున్సిపాలిటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక మంది కాపు ప్రజాప్రతినిధులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపులను ఐఖ్యం చేయడంలో క్యాలెండర్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు పడాల రవిందర్, సకినాల నర్సయ్య, మైదం రామకృష్ణ, వార్డు కన్వీనర్లు గాండ్ల అంజయ్య, పానగంటి సత్తయ్య, బొడ్డు తిరుపతి, ఆకుల నరేందర్, ఆకుల లక్ష్మన్, కర్నె శ్రీనివాస్, రాళ్లబండి రాజన్న, గుమ్మడి తిరుపతి, సీపతి సదయ్య, అగ్గు సాగర్, సోమిశెట్టి సాయి, పొగాకు రమేశ్, పెద్దపల్లి రామయ్య, అర్రవెల్లి రవీందర్, సిద్దం లింగయ్య పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment