రాత పరీక్షల నిర్వహణ

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటిషన్, ఫ్యాషన్ డిజైనింగ్ వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ పొందిన మహిళా అభ్యర్థులకు గురువారం వార్త పరీక్షలు నిర్వహించారు. ఈ రాత పరీక్షలకు 477 మంది అభ్యర్థులకు  గాను 362 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శ్రీరాంపూర్ ఏరియా సేవా అధ్యక్షురాలు రాధాకుమారి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడడానికి వృత్తి శిక్షణ దోహదపడతాయని, శిక్షణ పూర్తి చేసుకున్న స్వయం ఉపాధి పొందుతూ ఇతరులకు ఉపాధి కల్పించాలని కోరారు. మహిళలు ఆసక్తితో 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా సేవా సమితి ద్వారా వివిధ కోర్సులను నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ పి. అరవింద రావు, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు రీజినల్ అధికారి జె అనసూయ, సీనియర్ పిఓ పి. కాంతారావు, సింగరేణి సేవా సమితి చీఫ్ కోఆర్డినేటర్ (హైదరాబాద్) డిఎస్ శివకుమార్, ఖాదీ గ్రామ ఉద్యోగ్ ఆఫీసర్ (హైదరాబాద్) బానోతు నరేష్, సేవా సెక్రటరీ కొట్టే జ్యోతి, ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment