రెండు సంవత్సరాల కాల పరిమితికి అంగీకరించాలి

ఆర్.కె న్యూస్ , నస్పూర్: సింగరేణి కార్మికుల సమస్యలపై గుర్తింపు సంఘం ఏఐటీయూసీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రెండు సంవత్సరాల కాల పరిమితికి అంగీకరించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి అన్నారు. గురువారం బ్రాంచ్ అధ్యక్షులు గుల్ల బాలాజీతో కలిసి శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె7 గని కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగినా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు.  గుర్తింపు సంఘం కాల పరిమితి  నాలుగు సంవత్సరాల ఉండాలని ఏఐటీయూసీ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిన కారణంగా గుర్తింపు పత్రం జారీ చేయడంలో ఆలస్యం జరుగుతుందన్నారు. అనంతరం కార్మికులు తన దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను గని మేనేజర్ గారి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పిట్ సెక్రటరీ శ్రీధర్, పిట్ కమిటీ సభ్యులు సమ్మయ్య, ప్రవీణ్, నరేష్, అనిల్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment