లక్ష్య సాధనలో ఆర్కే-న్యూటెక్ గని ఆదర్శం

ఆర్కే-న్యూ టెక్ గని ఎస్ఓఎం ఇ.స్వామిరాజు

నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకోవడంలో ఆర్కే-న్యూటెక్ గని ఆదర్శంగా నిలుస్తుందని గని ఎస్ఓఎం ఇ.స్వామిరాజు అన్నారు. మంగళవారం గని ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆర్కే-న్యూ టెక్ గని ఎస్ఓఎం మాట్లాడుతూ సెప్టెంబర్ మాసంలో ఆర్కే-న్యూటెక్ గని 105 శాతం బొగ్గు ఉత్పత్తిని సాధించిందని, ఇందుకు కృషి చేసిన గని ఉద్యోగులు, సూపర్వైజర్లు, తోడ్పాటు అందించిన కార్మిక సంఘాల నాయకులను అభినందించారు. రాబోవు రోజుల్లో ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ వార్షిక లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. పని స్థలాల్లో రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పని చేసే ప్రదేశాలు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలన్నారు. కంపెనీ వ్యాప్తంగా ఈ నెల 31వ తేదీ వరకు నిర్వహిస్తున్న స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 3.0లో ఉద్యోగులు భాగస్వాములై గని లోని ప్రదేశాలు, కార్యాలయాలను శుభ్రంగా, సుందరీకరణగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో గని రక్షణాధికారి కొట్టె రమేష్, సంక్షేమాధికారి పాల్ సృజన్, వెంటిలేషన్ అధికారి శంకర్, ఇంజినీర్ కృష్ణ, జేఓ స్లాన్లీ జోన్స్, అండర్ మేనేజర్లు సాత్విక్, చంద్రమౌళి, తెబొగకాసం పిట్ కార్యదర్శి జంపయ్య, ఏఐటీయూసీ పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, ఐఎన్టీయూసీ పిట్ కార్యదర్శి మహేందర్, బీఎంఎస్ ప్రతినిధి వినయ్ కుమార్, హెచ్.ఎం.ఎస్  పిట్ కార్యదర్శి సురేందర్, సీఐటీయూ పిట్ కార్యదర్శి అజయ్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment