వనిత వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత మహా సంకల్ప శోభాయాత్ర

ఆర్.కె న్యూస్, నస్పూర్: అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని వనిత వాక్కు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం 108 కలశాలతో దుర్గామాత మహా సంకల్ప శోభాయాత్ర నిర్వహించినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, అడ్వకేట్, సైకాలజిస్ట్ రంగు వేణు కుమార్ తెలిపారు. శోభాయాత్ర విశ్వనాథ ఆలయం నుంచి ప్రారంభమై ఆర్.బి.హెచ్.వి స్కూల్ గ్రౌండ్ కు చేరుకున్న అనంతరం అమ్మవారికి అభిషేకం, లలిత సేవా సమితి వారిచే దుర్గా మాత అష్టోత్తర శతనామావళి పారాయణం, సాయంత్రం మహిళలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా  వనిత వాక్కు ఫౌండేషన్  వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ అమ్మవారి నవరాత్రుల్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం రావడం వల్ల ఆడ పిల్లల క్షేమం కోరుతూ, ఆడపిల్లలు ఆది పరాశక్తి గా మారి వారిని వారు రక్షించుకునే విధంగా దృఢంగా తయారవ్వాలని, అలాగే ప్రతి మనిషిలో పేరుకుపోతున్న చెడుని  సంహారించబడాలని కోరుతూ సర్వేజనా సుఖినోభవంతు అనే సంకల్పం తో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మార్వాడి యువ మంచ్, ఆర్.బి.హెచ్.వి స్కూల్ యజమాన్యం, స్పాన్సర్స్ కు  ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వనిత వాక్కు కో ఫౌండర్స్ తాళ్లపల్లి కవిత, కుర్మా సునీత, జ్యోత్స్న చంద్రధత్, చందన, చిగురు మంజుల, తణుకు తేజస్విని తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment