శ్రీ చైతన్యలో విద్యార్థులకు నాసా కిట్ల అందజేత
మంచిర్యాల, ఆర్.కె స్: శ్రీ చైతన్య పాఠశాల మందమర్రి బ్రాంచ్‌లో సోమవారం విద్యార్థులకు ప్రత్యేక నాసా కిట్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ ముఖ్య అతిథి హాజరై విద్యార్థులకు నాసా కిట్‌లను స్వయంగా అందజేసిన అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. విద్యార్థులకు పాఠ్యేతర అంశాలతో పాటు, విజ్ఞానాన్ని పెంపొందించే నాసా వంటి కార్యక్రమాలను నిర్వహించడం ఎంతో సంతోషకరమని అన్నారు. పిల్లల్లోని సృజనాత్మకతను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని, ఉపాధ్యాయులను ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ.జి.యం అరవింద్ రెడ్డి, అకాడమిక్ కో ఆర్డినేటర్ బి. నాగరాజు, ప్రధానోపాధ్యాయులు ఎం. రమేష్, అకాడమిక్ డీన్ కె. రవికుమార్, ప్రైమరీ ఇన్‌చార్జ్ ఎన్. సునిత, ప్రీ-ప్రైమరీ ఇన్‌చార్జ్ ఎ. తిరుమల, నాసా ఇన్‌చార్జ్ అదితి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.





