- నారాయణ పాఠశాలలో ఘనంగా వనమహోత్సవం
మంచిర్యాల, ఆర్.కె న్యూస్: విద్యార్థి దశ నుంచే మొక్కలు నాటడం అలవర్చుకోవాలని నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్య రావు అన్నారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని నారాయణ పాఠశాలలో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కరీంనగర్ జోన్ ఏజీఎం చైతన్య రావు పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు తమ ప్రత్యేకమైన రోజుల్లో మొక్కలు నాటి సంరక్షించాలి కోరారు. మొక్కలు నాటడం వల్ల కలిగే ఉపయోగాలు విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాదిశెట్టి కవిత, జోనల్ అనలిస్ట్ రాజేందర్, ఏవో సంజీవ్, వైస్ ప్రిన్సిపాల్ సంధ్యారాణి, ఆక్టివేట్ ఇంచార్జ్ గోపతి జ్యోతి ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.