విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి

శ్రీ చైతన్యలో ఘనంగా నాసా కిట్స్ పంపిణీ
ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ఐ గోపతి సురేష్

లక్షెట్టిపేట, ఆర్.కె న్యూస్: పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులకు శుక్రవారం ‘నాసా’ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎస్ఐ గోపతి సురేష్ విద్యార్థులకు తన చేతుల మీదుగా కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ.. చిన్న వయసులోనే అంతరిక్షంపై అవగాహన పెంచే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో భూమి నివాస యోగ్యం కాని పరిస్థితులు ఎదురైతే, అంతరిక్ష వాతావరణంపై అవగాహన ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు నాసా ప్రాజెక్టులైన ‘స్పేస్ కాలనీ’, ‘వాయుపుత్ర’లలో మంచి ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం నాసా ప్రత్యేకంగా రూపొందించిన టీ-షర్ట్స్, పెన్నులు, నోట్ బుక్స్ విద్యార్థులకు అందజేసి వారిని ప్రోత్సహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ అశ్విని మాట్లాడుతూ.. విద్యార్థులు నేర్చుకున్న కొత్త పరిజ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అకాడమిక్ డీన్ జి. సుధీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇంత ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పాఠశాల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, జోనల్ ఏజీఎం అరవింద రెడ్డి, కోఆర్డినేటర్ నాగరాజు ప్రత్యేకంగా అభినందించారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment