- మహిళల భద్రత కోసం షీ టీం
- మంచిర్యాల జిల్లా షీ టీం ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్
నస్పూర్, ఆర్.కె న్యూస్: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల జిల్లా షి టీమ్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో నస్పూర్ పట్టణంలోని సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు డ్రగ్స్, షి టీమ్ పని తీరుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా షి టీమ్ ఇంచార్జి ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ, మహిళల భద్రత కోసం షీ టీం పని చేస్తుందని అన్నారు. అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్ కాల్స్, మెసేజ్ లకు స్పందించకూడదని, సైబర్ మోసానికి గురైతే సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930లో సంప్రదించాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. డ్రగ్స్ సేవించడం వల్ల కలిగే అనర్థాలు, షీ టీమ్ ప్రాముఖ్యత, నిర్వహించే విధులు, మానవ అక్రమ రవాణా, ఫోక్సో చట్టం, బాల్య వివాహాల తదుపరి పరిణామాలు, ఈవ్ టీజింగ్, టీ-సేఫ్ అప్లికేషన్, సోషల్ మీడియా పరిణామాలు, సైబర్ క్రైమ్స్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరైనా డ్రగ్స్ సేవించిన, మహిళలను వేధించిన, రోడ్డుపై వెళ్లేటప్పుడు అవహేళన గా మాట్లాడిన, ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100 లేదా రామగుండం షీ టీమ్ నెంబర్ 6303923700 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షి టీమ్ ఎస్ఐ హైమ, ఉషారాణి, కానిస్టేబుల్స్ జ్యోతి, శ్రీలత, భరోసా సెంటర్ కో ఆర్డినేటర్ విజయ, భరోసా సిబ్బంది, జిల్లా న్యాయ సేవా సమితి సభ్యులు, కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.