- ఎండీటీ బృంద కన్వీనర్ జి.రవికుమార్
- ఆర్.కె న్యూటెక్ గనిపై ఎండీటీ సమావేశం
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇతర పరిశ్రమల నుంచి బొగ్గు తక్కువ ధరలో లభిస్తున్న నేపథ్యంలో వినియోగదారులకు నాణ్యమైన బొగ్గు అందించాల్సిన బాధ్యత ఉద్యోగులపై ఉందని ఎండీటీ బృంద కన్వీనర్ జి.రవికుమార్ (ఏజెంట్ ఎస్సార్పీ గ్రూప్) అన్నారు. గురువారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె న్యూ టెక్ గనిపై మేనేజర్ కురుపాటి శ్రీనివాసులు అధ్యక్షతన మల్టీ డిపార్టుమెంటల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎండీటీ బృంద సభ్యులు సాంబశివరావు (డీజీఎం, ఈ అండ్ ఎం),కె. అమర్నాథ్ (అడిషనల్ మేనేజర్, ఆర్ అండ్ డి ), వి. మహేష్ (అడిషనల్ మేనేజర్, ఎస్టేట్స్), జి. నరేష్ (డీవై ఎఫ్ఎం), వి. దేవేందర్ రెడ్డి (డీవై పీఎం) హాజరయ్యారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో సింగరేణి ఆర్థిక స్థితిగతులు, సంస్థ ప్రగతిలో ఉద్యోగుల పాత్రపై ఆయా విభాగాల అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎండీటీ బృంద కన్వీనర్ జి.రవికుమార్ మాట్లాడుతూ, బొగ్గు ఉత్పత్తితో పాటు ఉత్పాదకత పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. యువ ఉద్యోగులు కంపెనీ నాది అనే భావనతో పని చేయాలని తెలిపారు. ప్రతిరోజు తప్పకుండా విధులకు హాజరు కావాలని, గైర్హాజరు లేకుండా చూడాలని పేర్కొన్నారు. రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించేందుకు దృష్టి సారించాలన్నారు. భూగర్భ గనుల్లో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి అధికోత్పత్తి సాధించాలని, అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు సమన్వయంతో పని చేసినప్పుడే సంస్థ ప్రగతి సాధిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గని మేనేజర్ కురుపాటి శ్రీనివాసులు, గుర్తింపు సంఘం ఏరియా సహాయ కార్యదర్శి మోతుకూరి కొమురయ్య, గని రక్షణాధికారి కొట్టె రమేష్, పిట్ కార్యదర్శి ఆకుల లక్ష్మణ్, సీనియర్ సంక్షేమాధికారి పాల్ సృజన్, ఇంజనీర్ కృష్ణ, వెంటిలేషన్ అధికారి చంద్రమౌళి, అండర్ మేనేజర్ పరమేశ్వర్, ఇతర అధికారులు, నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.