విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా కస్తూరి నాగేశ్వర్

కలెక్టరేట్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సన్మానం
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి
వ్యవస్థాపక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్

నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం మంచిర్యాల జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్నికైన విశ్రాంత వ్యవసాయ విస్తరణ అధికారి కస్తూరి నాగేశ్వర్‌ను మంచిర్యాల కలెక్టరేట్ ఏరియా వాకర్స్, హెల్త్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు బుధవారం ఘనంగా సన్మానించారు. కస్తూరి నాగేశ్వర్ ప్రస్తుతం కలెక్టరేట్ ఏరియా వాకర్స్ హెల్త్ క్లబ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. బుధవారం ఉదయం వాకింగ్ అనంతరం నిర్వహించిన ఈ కార్యక్రమంలో, వాకర్స్ హెల్త్ క్లబ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుండేటి యోగేశ్వర్ ఆధ్వర్యంలో నాగేశ్వర్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. ఈ సందర్భంగా యోగేశ్వర్ మాట్లాడుతూ.. నాగేశ్వర్ నిగర్వి అని, నిత్యం వ్యాయామం చేస్తూ అందరితో ఎంతో కలివిడిగా ఉంటారని కొనియాడారు. ఆయన తన సేవా గుణంతో భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, సంపత్ కుమార్, శ్యాంసుందర్, జి. వెంకటేశం, అక్కల రమేష్, సాయి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొని నాగేశ్వర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment