– శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి
– ఘనంగా సేవా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా శ్రీరాంపూర్ ఏరియాలోని పలువురు నిరుపేద యువతి, యువకులు వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ పొంది స్వయం ఉపాధి పొందారని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని సీఈఆర్ క్లబ్ లో మంగళవారం సేవా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సేవా సమితి ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలో ఈ సంవత్సరం 473 మంది మహిళలు వివిధ వృత్తి శిక్షణ కోర్సులలో శిక్షణ పొందడం అభినందనీయమని, మహిళలు ముందుకు వస్తే నూతన కోర్సులను ప్రవేశపెట్టడానికి యాజమాన్యం తగిన ప్రణాళికలతో ముందుకు వెళుతుందని తెలిపారు. తదుపరి సేవా అధ్యక్షురాలు రాధాకుమారి మాట్లాడుతూ సేవా డిసెంబర్ 10, 2000వ సంవత్సరంలో ఆవిర్భవించిందని, సేవా ద్వారా శ్రీరాంపూర్ వ్యాప్తంగా అనేక మంది యువతీ, యువకులకు టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మోటార్ డ్రైవింగ్, హెవీ డ్రైవింగ్, వోల్వా డ్రైవింగ్ కోర్సులలో శిక్షణ ఇచ్చి వారి కుటుంబానికి అండగా నిలబడేలా తీర్చుదిద్దుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి రఘు కుమార్, డీజీఎం (పర్సనల్) అరవింద్ రావు, సీనియర్ పీవో కాంతారావు, సేవా సెక్రటరీ కొట్టె జ్యోతి, సేవా సభ్యులు శారద, తిరుమల, రజిత, సునీత, లక్ష్మి, రమ, సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
212