వృత్తి శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

  • శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవ రెడ్డి

ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే వృత్తి శిక్షణ తరగతులను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీరాంపూర్ ఏరియా జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి, సేవా అధ్యక్షురాలు రాధా కుమారి తో కలిసి ప్రగతి స్టేడియంలోని సిఈఆర్  క్లబ్ లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించే టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, కంప్యూటర్ డిటిపి ఉచిత వృత్తి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి సేవా సమితి ద్వారా పలువురు మహిళలు ఉచిత వృత్తి శిక్షణ కోర్సులు నేర్చుకుని, స్వయం ఉపాధి పొందడం హర్షణీయమని అన్నారు. వృత్తి శిక్షణ కోర్సులు నేర్చుకోవడంతోపాటు నలుగురికి ఉపాధి కల్పించాలని, ఇందుకోసం ప్రతి ఒక్క మహిళ కృషి చేయాలని, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి, తమ కుటుంబానికి ఆర్థికంగా భరోసా ఇవ్వడానికి మంచి అవకాశమని అన్నారు. సేవా అధ్యక్షురాలు రాధాకుమారి మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఏరియాలో వృత్తి శిక్షణ కోర్సులు నేర్చుకోవడానికి మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని, మహిళలు శిక్షణ తరగతులకు హాజరై మెలకువలను నేర్చుకోవాలని సూచించారు. నూతన కోర్సులను నేర్చుకోవడానికి మహిళలు ఆసక్తి కనబరిస్తే నూతన కోర్సులు ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (పర్సనల్) పి. అరవింద రావు, సీనియర్ పీవో పి. కాంతా రావు, సేవా సెక్రటరీ కొట్టే జ్యోతి, వృత్తి శిక్షణ కోర్సుల శిక్షకులు, సేవా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment