- గుర్తింపు కార్మిక సంఘం నాయకులు
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని కృష్ణ కాలనీ శాంతి స్టేడియంలో మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో శనివారం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కందికట్ల వీరభద్రయ్య, ముష్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా మాట్లాడుతూ, కృష్ణ కాలనీలోని శాంతి స్టేడియంలో కనీస సౌకర్యాలు లేక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, స్టేడియం చుట్టూ ప్రహరీ గోడతో పాటి సరిపడా విద్యుత్ దీపాలు లేకపోవడంతో ఆకతాయిలు మద్యం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతుందని, వర్షాకాలంలో స్టేడియంలో నీరు నిలిచి వాకర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా కార్మికుల కుటుంబ సభ్యులు శాంతి స్టేడియంలో బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారని, సింగరేణి యాజమాన్యం తక్షణమే స్పందించి కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా శాంతి స్టేడియంలో ప్రహరీ గోడను నిర్మించడంతో పాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని, స్టేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, కోశాధికారి నాగభూషణం, జీఎం కమిటీ చర్చల ప్రతినిధులు ప్రసాద్ రెడ్డి, బద్రి బుచ్చయ్య, సంపత్, గొల్లపల్లి రామచందర్, కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రీజియన్ కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, ఫిట్ కార్యదర్శిలు ఆకుల లక్ష్మణ్, గునిగంటి నర్సింగారావు, మోతే లచ్చన్న, నవీన్ రెడ్డి, సందీప్, సంఘం సదానందం, అగ్గు శ్రీకాంత్, పెద్దయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.