శ్రీరాంపూర్‌లో అయ్యప్ప స్వాముల నగర సంకీర్తన

నేడు ప్రగతీ స్టేడియంలో మండల మహా పడి పూజ, అగ్నిగుండ ప్రవేశం

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ కాలనీలోని ప్రగతీ స్టేడియంలో నేడు జరగనున్న అయ్యప్ప స్వాముల మహా సంగమం, మండల మహా పడి పూజను పురస్కరించుకొని అయ్యప్ప స్వాములు నగర సంకీర్తన నిర్వహించారు. భక్తి భావాన్ని, ఆధ్యాత్మికతను పెంపొందించే లక్ష్యంతో కాలనీ పుర వీధుల్లో ఈ సంకీర్తన జరిగింది. శ్రీరాంపూర్ కాలనీలోని భక్తాంజనేయాలయం నుంచి ప్రారంభమైన ఈ నగర సంకీర్తనలో అయ్యప్ప స్వాములు అయ్యప్ప, గణపతి, కుమారస్వామిల చిత్రపటాలతో పాల్గొన్నారు. భక్తులు అయ్యప్పస్వామి నామస్మరణ కీర్తనలు, భక్తి గీతాలతో కాలనీ వీధుల్లో నడుస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు. ఈ సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచారసభ (ఏబీఏపీ) శ్రీరాంపూర్ శాఖ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్ మాట్లాడుతూ.. నేడు స్థానిక ప్రగతీ స్టేడియంలో జిల్లా స్థాయి అయ్యప్ప స్వాముల మహా సంగమం, మహా మండల పడిపూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. కేరళకు చెందిన సంజీవ సంభూద్రి గురుస్వామిచే ఈ పూజా కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. పాప ప్రక్షాలనకు, భక్తి ప్రదర్శనకు చిహ్నంగా అయ్యప్ప స్వాములతో అగ్నిగుండాల్లో నడిపించడం కూడా జరుగుతుందని ఆయన వెల్లడించారు. లోక కళ్యాణార్థం, శ్రీరాంపూర్ ఏరియా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, సింగరేణి మరింత అభివృద్ధి చెంది అందరికీ ఉపాధి కల్పించాలని కోరుతూ సామూహికంగా ఈ పడి పూజ నిర్వహించడం జరుగుతుందని వివరించారు. వాడ వాడలా అయ్యప్ప స్వామి దీక్షా ప్రాముఖ్యతను భక్తులకు వివరిస్తున్నామని, పడి పూజకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పూజా కార్యక్రమాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఈ నగర సంకీర్తన కార్యక్రమంలో ఏబీఏపీ శ్రీరాంపూర్ శాఖ గౌరవ సలహాదారు సాదు వీరబద్రస్వామి, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ శివకుమార్, ఉపాధ్యక్షుడు చకిలం శ్రావణ్, ప్రదాన కార్యదర్శి బాస్కరి రాజేశం, ఏరియా కార్యదర్శి పడాల లింగయ్య, ఉపాధ్యక్షులు అప్పయ్య, సుంకెనపెల్లి రాజేందర్, పొదిల్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment