నస్పూర్ ఆర్.కె న్యూస్: సింగరేణి సంస్థ పర్యావరణ, అటవీ సలహాదారులు ఎంసీ పరిగెన్ సోమవారం శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ తో కలిసి గనుల లీజ్ అంశాలు, పర్యావరణ అనుమతులపై చర్చించారు. వారు ఇందారం ఉపరితల గని పరిసర ప్లాంటేషన్‌ను, నర్సరీ నిర్వహణ పద్ధతులను పరిశీలించి, సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంసీ పరిగెన్ మాట్లాడుతూ, ప్లాంటేషన్‌లో మొక్కలను సమర్థవంతంగా సంరక్షించడం ప్రశంసనీయమని, భవిష్యత్తులో మరింత విస్తృత స్థాయిలో మొక్కలను పెంచాలని సూచించారు. ఇలాంటి పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీజీఎం (ఫారెస్ట్) హరి నారాయణ, ఎస్టేట్స్ అధికారులు వి. మహేష్, ఎన్. మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.
24





