శ్రీరాంపూర్ ఓసీపీలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు

ఆర్ . కె న్యూస్, నస్పూర్: ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు శ్రీరాంపూర్ ఉపరితల గనిలో  బొగ్గు నాణ్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఓసీపీ గని మేనేజర్ బ్రహ్మాజీ రావు తెలిపారు. గురువారం ఎస్సార్పీ ఓసీపీ పై ఉద్యోగులతో కలిసి బొగ్గు నాణ్యత ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎస్సార్పీ ఓసీపీ గని మేనేజర్ బొగ్గు నాణ్యత ఆవశ్యకత, వినియోగదారుడు, నాణ్యత లోపం నివారించే చర్యలు, ఓపెన్ కాస్ట్ గనిలో తీసుకోవలసిన జాగ్రత్తలు, గ్యాలరీల శుభ్రత, గ్రేడియంట్, సీముల వద్ద డ్రిల్లింగ్ చేసే విధానంలో జాగ్రత్తలు వంటి పలు అంశాలు ఉద్యోగులకు వివరించారు. బొగ్గు నాణ్యత వారోత్సవాల్లో భాగంగా వ్యాసరచన, క్విజ్ పోటీలు ఉంటాయని ఆసక్తి గల ఉద్యోగులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమములో ఓపెన్ కాస్ట్ గని ఇంచార్జ్ రక్షణాధికారి జి. సంపత్, గుర్తింపు సంఘం శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్కె బాజీ సైదా, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ నల్లపు సత్తయ్య, అధికారుల సంఘం ప్రతినిధి, క్వాలిటీ ఇంచార్జ్ కమృద్దీన్, ఇంచార్జ్ పి.ఈ శ్యాంసుందర్ రావు, సంక్షేమ అధికారి బి. శంకర్, ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment