సంక్షేమాభివృద్ధి ఫలాలు అర్హులను లబ్దిదారులకు అందేలా చర్యలు

 జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ నుండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ప్రొబేషనర్స్ (ఎ.ఎస్.ఓ.)లు శిక్షణా కార్యక్రమం కోసం (ఎఫ్.టి.పి.)లో భాగంగా మన జిల్లాకు వచ్చిన బృంద ప్రతినిధులతో సమావేశం నిర్వహించి జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలచే అమలు చేయబడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై అధ్యయనం చేసి పరిశీలించిన అంశాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్ నుండి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ ప్రొబేషనర్స్ (ఎ.ఎస్.ఓ.)లు శిక్షణా కార్యక్రమం కోసం (ఎఫ్.టి.పి.)లో భాగంగా బృంద ప్రతినిధులు జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట, హాజీపూర్ మండలంలోని దొనబండ, తాండూర్ మండలంలోని మాదారం, బెల్లంపల్లి మండలంలోని పాత బెల్లంపల్లి, భీమిని మండలంలోని బిట్టూర్పల్లి గ్రామ పంచాయతీలలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరిశీలించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో సర్వశిక్షా అభియాన్ క్రింద రెండు / మూడు గ్రామాలకు ఒక ఉప కేంద్రం పని చేస్తుందని, జిల్లాలోని గ్రామాలలో ఏర్పాటు చేసిన సెగ్రిగేషన్ షెడ్లలో ఉపయోగకర వ్యర్థాల ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసి విక్రయించి ఆదాయం సమకూర్చడం జరుగుతుందని, ఈ ప్రక్రియపై ఒక డాక్యుమెంటేషన్ రూపొందించి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మన ఊరు – మన బడి కార్యక్రమంలో మొదటి విడతలో 248 పాఠశాలలను ఎంపిక చేసి 12 రకాల విభాగాలలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని, గ్రీన్ చాక్ బోర్డు, మూత్రశాలలు, శౌచాలయాలు, వంట శాలలు, భోజనశాలలు, ప్రహారీగోడ తదితర అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, డంపింగ్ యార్డు, నర్సరీ, క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాలో ఆయా గ్రామాల్లో చేపడుతున్న పనుల ఆధారంగా కూలీలకు ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు అందేలా సంబంధిత శాఖల సమన్వయంతో కార్యాచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. బృంద ప్రతినిధులు మాట్లాడుతూ తమ అధ్యయనంలో భాగంగా జిల్లాలోని ఎంపిక చేయబడిన గ్రామాలలో చేపట్టిన పరిశీలన కొరకు అన్ని సదుపాయాలు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా కలెక్టర్ కు మెమోంటో అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు  , జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment