సమాజ హితమే జర్నలిజం ధ్యేయం కావాలి

వాస్తవాలను వెలికితీయడంలో పాత్రికేయుల పాత్ర కీలకం
‘వార్త’ దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్

మంచిర్యాల, ఆర్.కె న్యూస్: సమాజంలో జరుగుతున్న వివిధ పరిణామాలను పాత్రికేయులు ఎప్పటికప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి చేరవేస్తూ వ్యవస్థల మధ్య వారధిగా పనిచేయాలని మంచిర్యాల ఏసీపీ రత్నపురం ప్రకాశ్ పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాలలోని ఏసీపీ కార్యాలయంలో ‘వార్త’ దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. పాత్రికేయులు వృత్తి ధర్మాన్ని పాటిస్తూ, సామాజిక బాధ్యతతో నిష్పక్షపాతంగా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. సామాజిక సమస్యలపై స్పందిస్తూనే, ప్రజలను చైతన్యవంతం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్. ప్రమోద్ రావు క్యాలెండర్‌ను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు.  వార్తా పత్రికలు ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికలుగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ‘వార్త’ పత్రిక ప్రతినిధులు కోడూరి శ్రీనివాస్, క్యాతం రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment