సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పరిశీలన

ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ పట్టణంలోని శ్రీ ముక్కిడి పోచమ్మ గుడి ఆవరణలో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల పనులను శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవరెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. శుక్రవారం జాతర ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు శ్రీ ముక్కిడి పోచమ్మ గుడి దగ్గర సమ్మక్క సారలమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించడానికి భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. జాతర సమయంలో వైద్య సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు. సింగరేణి ఉద్యోగులు, పరిసర ప్రాంత ప్రజలు తమ కుటుంబ సభ్యులతో సమ్మక్క-సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం కె. రఘు కుమార్, డీజీఎం (సివిల్) ఆనంద్ కుమార్, ఏరియా వర్క్ షాప్ ఎస్.ఈలు మల్లయ్య, సతీష్ చక్రవర్తి, సీనియర్ పీవో పి.  కాంతారావు, ఆలయ పూజారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment