ఆర్.కె న్యూస్, నస్పూర్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3,3ఏ గనిలో బదిలీ వర్కర్ గా పని చేస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన కాదాసి దుర్గా ప్రసాద్ భార్యకు ఉద్యోగుల సామాజిక సంక్షేమ నిధి కింద గని ఉద్యోగుల నుంచి రికవరీ చేయబడిన 62,250 రూపాయల చెక్కును గని మేనేజర్ వెంకట్ రావు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సార్పీ 3,3ఏ గని మేనేజర్ మాట్లాడుతూ మరణించిన ఉద్యోగి కుటుంబం కోసం స్వచ్ఛందంగా సామాజిక సంక్షేమ నిధి మొత్తాన్ని అందిస్తున్నందుకు ఉద్యోగులను అభినందించారు. మృతుని కుటుంబానికి కంపెనీ నుంచి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ త్వరగా అందేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారి ఎండీ గౌస్ పాషా, రక్షణాధికారి జి. శ్రీధర్, గుర్తింపు సంఘం పిట్ కార్యదర్శి మురళీ చౌదరి, అధికారులు కామేశ్వర్ రావు, అరుణ్ కుమార్, రాకేష్ అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
162