సింగరేణిలో అక్టోబర్ 3న దసరా సెలవు ఇవ్వాలి

  • ఏఐటీయూసీ నాయకులు
సింగరేణిలో అక్టోబర్ 3న దసరా సెలవు ఇవ్వాలని కోరుతూ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు  శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, విభాగాల అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ (ఏఐటీయూసీ) యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కందికట్ల వీరభద్రయ్య , ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్ కే బాజీ సైదాలు  మాట్లాడుతూ, జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజున  తెలంగాణలో అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దసరా పండుగ రావడంతో దసరా పండుగను సింగరేణి ఉద్యోగులు వైభవంగా నిర్వహించుకోవడానికి వీలు లేకుండా పోయిందని, మైసమ్మ తల్లి దీవెనలు తమ పై ఉండాలని, విధి నిర్వహణలో ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని కోరుతూ సింగరేణి కార్మికులు దసరా రోజున ప్రత్యేక పూజలు చేస్తారని పేర్కొన్నారు. ఇప్పటికే కోల్ ఇండియాలో బొగ్గు సంస్థలు దసరా తేదీని మార్చుటకు నిర్ణయం తీసుకున్నాయని, సింగరేణి కార్మికుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని అక్టోబర్ 3న దసరా సెలవు ప్రకటించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జీఎం చర్చల ప్రతినిధులు రాచర్ల చంద్రమోహన్, ప్రసాద్ రెడ్డి, సంపత్, బద్రి బుచ్చయ్య, పిట్ కార్యదర్శులు దాడి రాజయ్య, మురళి చౌదరి, గునిగంటి నర్సింగ రావు, మారుపెల్లి సారయ్య, నవీన్ రెడ్డి, మోతే లచ్చన్న, కుమారస్వామి, ఆడెపు మల్లికార్జున్, ఎడ్ల సమ్మయ్య, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment