- శ్రీరాంపూర్ జీఎం ఎం. శ్రీనివాస్
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సాంకేతికతతో సింగరేణిలో ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి కాగితపు రహిత సేవలకు శ్రీకారం చుడుతున్నట్లు శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం సిసిసిలోని సింగరేణి గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్ లో డీజీఎం (ఐటి) బి. హరిప్రసాద్, ఐటీ మేనేజర్ ఏం.కిరణ్ కుమార్, సీనియర్ ప్రోగ్రామర్ కే. శంకర్, ట్రైనీ ప్రోగ్రామర్ జి. రమ్య బృందం ఆధ్వర్యంలో ఏరియా అధికారులకు ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టెక్నాలజీని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వినియోగిస్తున్నాయని, సింగరేణిలో సాప్ వినియోగంతో పనులు సులభతరం, ఖచ్చితత్వంగా చేయడం జరుగుతుందని, ఫైల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ టెక్నాలజీతో కాగితం వినియోగం ఘననీయంగా తగ్గి, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్, జీఎం (సివిల్) శ్రీనివాస రావు, బెల్లంపల్లి రీజియన్ క్వాలిటీ జనరల్ మేనేజర్ సుశాంత సహా, ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ టి. శ్రీనివాస్ గారు, ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, ఏజీఎం (సివిల్ క్వాలిటీ) బి. నవీన్, డీజీఎంలు పి. అరవింద రావు, కె. చిరంజీవులు, ఆనంద్ కుమార్, చంద్ర లింగం, మల్లయ్య, ఆర్.కె 5,6 గ్రూప్ ఏజెంట్ శ్రీధర్, డివై సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు, లా అధికారి శిరీష రెడ్డి, ఎస్టేట్స్ అధికారి వరలక్ష్మి గారు, అకౌంట్స్ మేనేజర్ జి. నాగలక్ష్మి, ఐటీ ప్రోగ్రామార్, వివిధ గనుల మేనేజర్లు, ఇతర అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.