సింగరేణి ఉద్యోగులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

  • గుండెపోటు నివారణ అంశాలపై అవగాహన కలిగి ఉండాలి
  • శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
నస్పూర్ ,  ఆర్.కె న్యూస్: సింగరేణి ఉద్యోగులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. సోమవారం ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకొని  ఆర్.కె 8 డిస్పెన్సరీలో డిప్యూటీ సీఎంఓ డాక్టర్ పి. రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి శ్రీరాంపూర్ జీఎం ముఖ్య అతిథిగా హాజరై, హృదయ సంబంధిత వ్యాధులు, నివారణ చర్యలకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు గుండెపోటు నివారణ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని, శరీర బరువు అదుపులో ఉంచుకోవాలని, రక్తపోటు మధుమేహం వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుకోవాలని పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధి గ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వాడాలని, సంబంధిత ఆస్పత్రిలో రెగ్యులర్ చెకప్ చేయించుకోవాలని చెప్పారు. ఈ సంవత్సర హృదయ దినోత్సవ థీమ్ డోంట్ మిస్ ఏ బీట్  అని, ఎవరైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందికి గురైనా, గుండె దడ ఉన్న, ఛాతిలో నొప్పి ఉన్న నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి, డాక్టర్ సాయి నికిత, డాక్టర్ పింకీ, డిస్పెన్సరీ పిట్ కార్యదర్శి విజయలక్ష్మి, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
AD 01

Follow Me

images (40)

Leave a Comment