సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

  • కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎలక్షన్ కమిషన్
  • ఐ.ఎన్.టి.యు.సి సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్

నస్పూర్,  ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐ.ఎన్.టి.యు.సి సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ అన్నారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ, సింగరేణి కార్మికుల సమస్యలపై యాజమాన్యానికి అవగాహన లేదని, సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని, మారు పేర్ల బాధితుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న 3600 విజిలెన్స్ కేసులు లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించాలని పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి, సేవ్ సింగరేణి, సేవ్ వర్కర్స్ అనే నినాదంతో ఈ నెల 14న అన్ని జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా, ఈనెల 22న 2 వేల మంది కార్మికులతో కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి చేయనున్నట్లు తెలిపారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం లేదని, జాతీయ ఎలక్షన్ కమిషన్ ఓటర్ లిస్ట్ తయారీలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఎలక్ట్రోల్ డేటా అడిగితే ఇవ్వడం లేదని, ఈసీని కలవడానికి వెళ్లిన 300 మంది ఎంపీలను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 60 లక్షల ఈవీఎంలు కొనుగోలు చేస్తే అందులో 40 లక్షల ఈవీఎంలు మాత్రమే అకౌంట్ లో ఉన్నాయని మిగతా 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలన్నారు. 2024లో పది రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, బెంగళూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మహాదేవపూర్ లో 1,00,250 దొంగ ఓట్లు ఉన్నాయని, ఒకే వ్యక్తికి నాలుగు రాష్ట్రాల్లో ఓట్లు, తండ్రి పేరు అడ్రస్ లేకుండా ఎన్నో దొంగ నోట్లు ఉన్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం, జాతీయ ఎలక్షన్ కమిషన్ వైఖరిని నిర్వహిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్, కాంగ్రెస్ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పోరాటాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కాంపల్లి సమ్మయ్య, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ జెట్టి శంకర్ రావు, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ కలవేన శ్యామ్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ రామిశెట్టి నరేందర్, మందమర్రి ఏరియా వైస్ ప్రెసిడెంట్ భూమన్న, జనరల్ సెక్రటరీ ఏనుగు రవీందర్ రెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ గరిగ స్వామి, జీవన్ జోయల్, మైనింగ్ స్టాప్ ఇంచార్జ్ తిరుపతి రాజు, సెంట్రల్ సెక్రటరీలు మెండె వెంకన్న, అశోక్, వివిధ గనుల పిట్ సెక్రటరీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment