సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు పోరాటం

  • ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు

నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు పోరాటం చేస్తామని ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఇంచార్జ్ జెట్టి శంకర్ రావు అన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె 5 గని పై కేంద్ర కార్యదర్శలు పిన్నింటి మల్లారెడ్డి,  రామకృష్ణ, పిట్ కమిటీ సమన్వయంతో బుధవారం సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్  (ఐఎన్టీయూసీ) సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు, శ్రీరాంపూర్ బ్రాంచ్ ఇంచార్జ్ జెట్టి శంకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ కేంద్ర సీనియర్ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ, ఆర్.కె 5 గని కార్మికులు పెద్ద సంఖ్యలో సభ్యత్వం పొందారని, యూనియన్ స్కానర్ ద్వారా సభ్యత్వ రుసుము చెల్లించి స్వచ్ఛందంగా సభ్యులుగా చేరినట్లు పేర్కొన్నారు. సింగరేణి కార్మికుల హక్కులు సాధించడమే తమ యూనియన్ లక్ష్యమని, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణిలో పేరుకుపోయిన అనేక సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపుదిద్దుకుంటుందని అన్నారు. గత రెండు సంవత్సరాలుగా గుర్తింపు సంఘం కార్మికుల కోసం ఎలాంటి విధివిధానాలు చేపట్టలేదని  ఆరోపించారు. సింగరేణి అభివృద్ధి, కార్మికుల సంక్షేమం ఐఎన్టీయూసీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర నాయకులు గరిగే స్వామి, తిరుపతి రాజు, ఏనుగు రవీందర్ రెడ్డి, పిన్నింటి మల్లారెడ్డి, రామకృష్ణ, శ్రీనివాసరావు, మహేందర్ రెడ్డి, పెద్దిరాజు, శ్రీధర్ల మల్లేష్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment