93
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి నూతన సంవత్సర క్యాలెండర్ ను శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ ఎల్.వి సూర్యనారాయణ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ, సింగరేణి అందరికీ ప్రేరణ కలిగించే విధంగా, సంస్థ సాధిస్తున్న బహుముఖ ప్రగతి, సంక్షేమం, సామాజిక సేవకు ప్రతీకగా నూతన క్యాలెండర్ రూపొందించబడిందని అన్నారు. సింగరేణి క్యాలెండర్ ప్రతి ఉద్యోగిలో నూతన ఆనందాన్ని నింపుతుందని, ఇదే ఉత్సాహంతో ఏరియాకు కేటాయించిన బొగ్గు లక్ష్యాన్ని రక్షణతో సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం ఎన్. సత్యనారాయణ, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కె వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీరాంపూర్ ఉపరితల గని ప్రాజెక్ట్ ఆఫీసర్ టి శ్రీనివాస్, డీజీఎం పర్సనల్ పి అరవింద రావు, డీజీఎం (ఐఈడి) చిరంజీవులు, ఏరియా రక్షణాధికారి శ్రీధర్ రావు, ఎస్ఈ (ఐఈడి) కిరణ్ కుమార్, ఎస్టేట్స్ ఆఫీసర్ వరలక్ష్మి, ఎన్విరాన్మెంటల్ ఆఫీసర్ బి. హనుమాన్ గౌడ్, సెక్యూరిటీ అధికారి జక్కా రెడ్డి, సీనియర్ పిఓ పి కాంతారావు, ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్, పిట్ కార్యదర్శి బి సందీప్ తదితరులు పాల్గొన్నారు.