121
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఇటీవల సింగరేణి డైరెక్టర్ (పిపి)గా నియామకమైన కె. వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ ఏరియాకు బదిలీ పై వచ్చిన ఎం. శ్రీనివాస్ ను శుక్రవారం ఏఐటీయూసీ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య మాట్లాడుతూ, జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ సింగరేణి సంస్థలో డైరెక్టర్ (పీపీ )గా వెంకటేశ్వర్లు ఎన్నిక కావడం హర్షణీయమని, సంస్థ మనుగడకు, కార్మికుల సంక్షేమానికి తనదైన శైలిలో పనిచేస్తూ డైరెక్టర్ (పిపి) వెంకటేశ్వర్లు ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కే సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఉపాధ్యక్షులు కొట్టే కిషన్ రావు, అసిస్టెంట్ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, జీఎం చర్చల ప్రతినిధులు, అన్ని గనుల ఫిట్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.