సింగరేణి పరిరక్షణ కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

– ఐఎన్టియుసిని భారీ మెజార్టీతో గెలిపించాలి
– మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఆర్.కె న్యూస్, నస్పూర్
సింగరేణిని కాపాడే శక్తి, సత్తా కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని, సింగరేణి పరిరక్షణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టియుసి భారీ మెజారిటీతో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతిపరులకు ఐఎన్టియుసిలో స్థానం లేదని స్పష్టం చేశారు. హక్కుల సాధన కోసం గుర్తింపు సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికవర్గాన్ని కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలోని కార్మికుల బాధ్యత తాను తీసుకుంటానని ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. గత పాలకులు డి.ఎం.ఎఫ్.టి నిధులను ఇతర ప్రాంతాలకు తరలించి దుర్వినియోగం చేశారన్నారు. ప్రస్తుతం సింగరేణి సంస్థలో యువ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, విద్యావంతులైన యువ కార్మికులు తమ హక్కులు సాధించే ఐఎన్టియుసిని ఎన్నుకోవాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన స్థానిక ప్రజలు, సింగరేణి కార్మికులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తుందన్నారు. ప్రతినెల 2వ, 4వ ఆదివారం సింగరేణి కార్మికులు, రిటైర్డ్ కార్మికుల కోసం సమయం కేటాయిస్తానని తెలిపారు. సింగరేణి కార్మికులకు 250 గజాల ఇంటి స్థలం, 20 లక్షల వడ్డీలేని రుణాలు ఇప్పించడానికి, నస్పూర్ లో సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు జెట్టి శంకర్ రావు, కలవేన శ్యామ్, తిరుపతి రాజు, భీం రవి, కాంగ్రెస్ నాయకులు తూముల నరేష్, పూదరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment