సింగరేణి పరిరక్షణ సమితిగా ఏర్పడి సంస్థను కాపాడుకుందాం

సింగరేణికి రావాల్సిన రూ. 45 వేల కోట్లు తక్షణమే చెల్లించాలి
కొత్త బ్లాకులు సంస్థకే దక్కాలి

  • ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య

నస్పూర్, ఆర్.కె న్యూస్:  సింగరేణి సంస్థ మనుగడ కోసం అన్ని కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు ఏకమై సింగరేణి పరిరక్షణ సమితిగా ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నస్పూర్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తితో సింగరేణిని కాపాడుకోవాలన్నారు. సంస్థకు కొత్త బొగ్గు బ్లాకులు వస్తేనే భవిష్యత్తు ఉంటుందని, ముఖ్యంగా మణుగూరు ఓసీ-2 విస్తరణ బ్లాక్‌లో 60 మిలియన్ టన్నుల బి-గ్రేడ్ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని తెలిపారు. ఈ బ్లాక్ సింగరేణికి దక్కితే ఆ ప్రాంతానికి మరో 20 ఏళ్లు ఢోకా ఉండదన్నారు. అయితే వేలంలో ఈ బ్లాక్‌ను దక్కించుకోవడానికి మరో ఆరు కంపెనీలు పోటీ పడుతున్నాయని, వాటిని అడ్డుకొని ఆ బ్లాక్ సింగరేణి సొంతమయ్యేలా చూడాలని కోరారు. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి చొరవ తీసుకొని వేలం నుండి జెన్‌కో సంస్థ విరమించుకునేలా కృషి చేయాలన్నారు. కోయగూడెం, సత్తుపల్లి ఓసీలను కూడా సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన రూ. 45 వేల కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించాలని, సంస్థ ఆర్థిక పటిష్టతకు ఈ నిధులు కీలకమని అన్నారు. అలాగే, సీ.ఎస్.ఆర్, డి.ఎం.ఎఫ్.టి నిధులను కేవలం సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని, నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావాల్సిన బకాయిల చెల్లించేలా, మెడికల్ బోర్డు నిర్వహణకు ఐ.ఎన్.టి.యు.సి నాయకులు కృషి చేయాలని, అనవసరంగా గుర్తింపు సంఘంపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ సాధనలో, కాంగ్రెస్ గెలుపులో సింగరేణి కార్మికుల పాత్ర కీలకమని గుర్తు చేశారు. కోల్ బెల్ట్ ప్రాంత ఎమ్మెల్యేలు సింగరేణి పరిరక్షణకు నడుం బిగించాలన్నారు. గత ఎన్నికల్లో సింగరేణి పరిరక్షణకు కృషి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ సమావేశంలో యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు కే. వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్ సెక్రటరీ ఎస్.కె బాజీ సైదా, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కొమరయ్య, నాయకులు గునిగంటి నర్సింగరావు, అఫ్రోజ్ ఖాన్, విజయలక్ష్మి, సదానందం, అనంతరెడ్డి, పరశురాం తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment