సింగరేణి వార్షిక లాభాల్లో కాంట్రాక్టు కార్మికులకు వాటా చెల్లించాలి

సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు లాభాల్లో వాటా చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ సి.హెచ్.పి లో నిర్వహించిన గేట్ మీటింగ్ కు సింగరేణి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముస్కె సమ్మయ్య, బెల్లంపల్లి రీజియన్ ప్రధాన కార్యదర్శి అఫ్రోజ్ ఖాన్, శ్రీరాంపూర్ బ్రాంచ్ అధ్యక్షులు దొడ్డిపట్ల రవీందర్ హాజరై మాట్లాడుతూ కోల్ ఇండియాలో మాదిరిగా సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని,  జీవో నెంబర్ 22 ప్రకారం కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని, సింగరేణి యాజమాన్యం జీవో నెంబర్ 22ను గజిట్ కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇప్పటిదాకా గెజిట్  చేయలేదన్నారు. గత సంవత్సరం సెప్టెంబర్ 9 నుంచి 26 వరకు కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన సమ్మెలో భాగంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో యాజమాన్యం ఆర్.ల్.సి సమక్షంలో జరిగిన ఒప్పందాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు.  తక్షణమే కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టు కార్మికుల సీఎంపిఎఫ్ లెక్కలను సరిచేసి, సీఎంపిఎఫ్ చిట్టీలు పంపిణీ చేయాలన్నారు. లేని పక్షంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సాధించిన హక్కులు, చేస్తున్న పోరాటాలకు ఆకర్షితులై సి.హెచ్.పి నుండి వివిధ కార్మిక సంఘాలకు చెందిన 35 మంది కాంట్రాక్టు కార్మికులు యూనియన్ లో చేరారు. వీరికి నాయకులు కండువాలు కప్పి యూనియన్ లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు కాతరాజు ప్రభాకర్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఆర్.కె 5 గని పిట్ కార్యదర్శి గునిగంటి నర్సింగ్ రావు, కాంట్రాక్ట్ కార్మిక సంఘం బ్రాంచ్ కోశాధికారి పల్లె సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment