యాదాద్రి-భువనగిరి జిల్లా, బీబీ నగర్ లోని అల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్)లో సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్ తో పాటు ప్రత్యేక అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మాత్యులు మన్సుఖ్ మాండవీయ కు ఈ మెయిల్ ద్వారా వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణు మాధవ్ మాట్లాడుతూ మేడ్చల్-మల్కాజ్ గిరి, యాదాద్రి-భువనగిరి జిల్లాలలో దాదాపు 10 వేల మంది సింగరేణి విశ్రాంత కార్మికులు వారి కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారని, సింగరేణి యాజమాన్యానికి 40 వేల రూపాయలు చెల్లించి సి.పి.ఆర్.ఎం.ఎస్ (కాంట్రిబ్యూటరీ పోస్ట్ మెడికేర్)కార్డ్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగ దంపతులు కొన్ని ఒప్పంద ఆసుపత్రులలో ఎనిమిది లక్షల రూపాయల వైద్య సౌకర్యం వైద్యం పొందుతున్నారని అన్నారు. ఈ ఆసుపత్రులు స్థిర నివాసాలకు దూరంగా ఉండటం వలన అత్యవసర స్థితి లో అధిక రవాణా ఖర్చులు భరించవలసి వస్తుందన్నారు. ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎమ్స్)లో సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సలహాదారులు టి. ఉమాకర్, బి. బానయ్య, జి. పార్థసారథి, ఎం. మధునయ్య, ఎస్.లక్ష్మీ నారాయణ, టి.రాజ్ కుమార్, జి. కనకయ్య, రామ రాజు, నరసింహ రావు, ప్రతాప్ సింగ్, రాజీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
219