- నస్పూర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఈ నెల 20 నుంచి 22 వరకు మేడ్చల్ జిల్లాలో జరుగనున్న భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ నస్పూర్ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక నర్సయ్య భవన్ లో రాష్ట్ర 4వ మహాసభ గోడ పత్రికలను సిపిఐ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నస్పూర్ మండల కార్యదర్శి మాట్లాడుతూ, ఈ మహాసభలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ డి. రాజా, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణలు హాజరవుతారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు బడా కార్పొరేట్లకు కార్పొరేట్లకు దారాదత్తం చేస్తూ ప్రజలపై అధిక భారాన్ని మోపుతోందని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలులో విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహాయ కార్యదర్శి లింగం రవి, జిల్లా కౌన్సిల్ సభ్యులు మిర్యాల రాజేశ్వరరావు, దొడ్డిపట్ల రవీందర్, పూజారి రామన్న, ఇలవేణి సారంగపాణి, బిసి సాధన సమితి మండల అధ్యక్ష, కార్యదర్శులు జోగుల ఆంజనేయులు, బొడ్డు లచ్చన్న, నాయకులు అల్లా లచ్చిరెడ్డి, నాగపురి సమ్మయ్య, ఎండి. రషీద్ తదితరులు పాల్గొన్నారు.