62
నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ అభినవ కాలనీలో ఓ ఇంటిపై సెల్ టవర్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. శనివారం కాలనీ వాసులు, మహిళలు పిల్లలతో సహా సెల్ టవర్ నిర్మించబోయే ఇంటి ముందు ప్లకార్డులు పట్టి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు వెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ, జనావాసాల మధ్య సెల్ టవర్ పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సెల్ టవర్ ఏర్పాటు వల్ల రేడియేషన్ కు గురై అనారోగ్య బారిన పడే అవకాశం ఉందన్నారు. పలుమార్లు ఇంటి యజమానికి సెల్ టవర్ ఏర్పాటు చేయవద్దని కోరినప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. విద్యుత్ శాఖ అధికారులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులను కలిసి సెల్ టవర్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు ఇవ్వవద్దని విన్నవించుకున్న ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, సెల్ టవర్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని, ఇక్కడి నుండి తరలించాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాలనీ వాసులు పాల్గొన్నారు.