సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి

  • టీజీబి సీతారాం పల్లి శాఖ నిర్వహణ అధికారి నరసింహ స్వామి
  • ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత పై అవగాహన

ఆర్.కె న్యూస్, నస్పూర్: సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్, కాల్స్ కు స్పందించ వద్దని తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీతారాం పల్లి శాఖ నిర్వహణ అధికారి నరసింహ స్వామి అన్నారు. శుక్రవారం నస్పూర్ పట్టణంలోని రెడ్డి కాలనీలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీతారాం పల్లి శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్, సీతారాం పల్లి శాఖ నిర్వహణ అధికారి నరసింహ స్వామి మాట్లాడుతూ సామాజిక భద్రతా పథకాలైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ఎస్.బి.ఐ జనరల్ ఇన్సూరెన్స్, అటల్ పెన్షన్ యోజన, పి.ఎం.జె.డి.వై జమ ఖాతా తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఫోన్ ద్వారా మొబైల్ బ్యాంకింగ్, రూపే కార్డు ద్వారా యూపీఐ లావాదేవీలు, ఆధార్ అనుసంధానం చేసుకుని వేలిముద్ర వేసి కస్టమర్ సర్వీస్ పాయింట్ సెంటర్ల ద్వారా జమ, విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వారు తమ  పాస్ వర్డ్, పిన్ నెంబర్ రహస్యంగా ఉంచుకోవాలని, ఎవరికి తెలియజేయవద్దని సూచించారు. టీజీబి దిశ యాప్ ద్వారా ఇంటి వద్ద నుంచే జమ ఖాతాను తీసుకోవచ్చని తెలిపారు. అధిక వడ్డీ ఆశ చూపి మోసపుచ్చే ప్రైవేటు వ్యక్తుల బారిన పడవద్దని, తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో దాచుకొని తమ పొదుపు మొత్తాలకు తగు వడ్డీని, అధిక భద్రతను పొందాలని కోరారు. పది రూపాయల బిల్లలు చలామణిలో ఉన్నాయని, బ్యాంకులో జమ చేయవచ్చని తెలిపారు. ఎంవి రూరల్ ఫోక్ ఆర్ట్ ఆర్గనైజేషన్ సభ్యులు రవి, కిరణ్ కళాజాత కార్యక్రమం ద్వారా మేజిక్ షో తో బ్యాంకు పథకాల పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీతారాం పల్లి శాఖ క్షేత్రాధికారి రవి, మెప్మా టిఎంసి నాగరాజు, మహిళా సంఘాల రిసోర్స్ పర్సన్లు శ్రీదేవి, రజిత, సత్యవతి, వర్ష, లత, భాగ్య, పద్మ, భాగ్యలక్ష్మి, నాగలక్ష్మి, మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు, బ్యాంకు ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment