హాస్టల్ వర్కర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి

ఎస్సీ వెల్ఫేర్ అడిషనల్ డైరెక్టర్‌కు ఐఎఫ్ టీయూ మెమోరండం

నస్పూర్, ఆర్.కె న్యూస్: మంచిర్యాల జిల్లా షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ వర్కర్లకు 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్ టీయూ రాష్ట్ర నాయకులు డి. బ్రహ్మానందం డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ శ్రీధర్‌కు వినతిపత్రం అందజేశారు. కంటిన్యూషన్ ఆర్డర్ సాకుతో ట్రెజరీలో బిల్లులు ఆగిపోయాయని, ఫైనాన్స్ శాఖలో ఫైల్ పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతూ కాలయాపన చేయడం వల్ల కార్మికులు ఆర్థికంగా చితికిపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టీయూ నాయకులు రాజన్న, సంపత్, రాజేశ్వరి, శారద, కవిత, లక్ష్మి, శ్యామల, అంజలి తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment