హెచ్ఎంపి వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • సింగరేణి డాక్టర్ లోకనాథ్ రెడ్డి

ఆర్.కె న్యూస్, నస్పూర్: హెచ్ఎంపి వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ లోకనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలోని రవీంద్రఖని 7 గని పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ లోకనాథ్ రెడ్డి మాట్లాడుతూ, హెచ్ఎంపి వైరస్ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులను వేగంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ  వ్యక్తిగత దూరం పాటించాలని, విధిగా మాస్కులు ధరించాలని, సానిటైజర్స్, సబ్బుతో తరచుగా చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలతో వ్యాప్తి చెందుతున్న హెచ్ఎంపి వైరస్ ప్రమాదకరం కాకపోయినప్పటికీ వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతిఒక్కరు ముందస్తు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ తిరుపతి, రక్షణ అధికారి సంతోష్ రావు, ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ మారేపల్లి సారయ్య, బానయ్య, వెంటిలేషన్ ఆఫీసర్ జగదీష్ రావు, అండర్ మేనేజర్లు రవీందర్, రాము ,బాలకృష్ణ ,రాజు, ఇంజనీర్లు ప్రవీణ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment