11వ వేజ్ బోర్డు ఏరియర్స్ చెక్కులు పంపిణీ

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే-7 గని ఉద్యోగులు ఏ. రాజమల్లు (ఎలక్ట్రిషన్), కమలాకర్ రావు ( షార్ట్ ఫైరర్) లకు ఏరియా జనరల్ మేనేజర్ బి. సంజీవ రెడ్డి 11వ వేజ్ బోర్డు 23 నెలల ఏరియర్స్ చెక్కులు  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ జీఎం మాట్లాడుతూ కోల్ ఇండియాలో అమలైన 11వ వేజ్ బోర్డు 23 నెలల ఏరియర్స్ జీతాలను సింగరేణి యాజమాన్యం నేడు ఉద్యోగుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందన్నారు. ఆర్కే-7 గనికి చెందిన ఇద్దరు ఉద్యోగులకు శ్రీరాంపూర్ ఏరియాలో అత్యధికంగా ఏరియర్స్  జీతాలు రావడం సంతోషకరమని అన్నారు. ఉద్యోగులు ఏరియర్స్ జీతాల నగదు మొత్తాన్ని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగి రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించాలని, విధులకు హాజరయ్యే క్రమంలో ఉద్యోగులు హెల్మెట్లను ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలన్నారు. రక్షణ మన జీవితంలో భాగంగా అలవర్చుకోవాలని అన్నారు. ఉత్పత్తి సాధనలో ఉద్యోగులు, అధికారులు ఒకటిగా పని చేసి, వార్షిక లక్ష్యాన్ని సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి కొట్టే కిషన్ రావు, హెచ్ఎంఎస్ ఏరియా సెక్రటరీ రాజేంద్రప్రసాద్, ఐఎన్టియుసి జాతీయ ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు, సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి భాగ్యరాజు, బిఎంఎస్ బ్రాంచ్ కార్యదర్శి నాతడి శ్రీధర్ రెడ్డి, అర్కే-7 గ్రూప్ ఏజెంట్ ఎం. రాముడు, డివైజియం (పర్సనల్) పి. అరవింద్ రావు, గని మేనేజర్ సాయి ప్రసాద్, గ్రూప్ ఇంజనీర్ రాజా రవి చరణ్,  సీనియర్ పిఓ కాంతారావు, గుర్తింపు సంఘం ఫిట్ సెక్రెటరీ మెండె వెంకటి, ఫిట్ ఇంజనీర్ ప్రవీణ్, అండర్ మేనేజర్లు రవీందర్, లక్ష్మణ్, శశాంక్ సాయి, వెంటిలేషన్ ఆఫీసర్ జగదీశ్వర్ రావు, సంక్షేమ అధికారి పాల్ సృజన్ ఇతర అధికారులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

AD 01

Follow Me

images (40)

Leave a Comment