ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఆర్డీవోలు రాజేశ్వర్, సురేష్ లతో కలిసి గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితా తయారీ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని అన్నారు. ఓటరు జాబితా సంకీర్త సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 19వ తేదీ వరకు నూతన ఓటర్ నమోదు, ఓటరు జాబితా సవరణల ప్రక్రియ కొనసాగుతుందని, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారు తమ ఏజెంట్లను నియమించి బూత్ స్థాయి అధికారులతో కలిసి స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించేలా కృషి చేయాలని తెలిపారు. ఫోటో ఓటరు జాబితాలో ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
12 September 2023
గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి జరిగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా శాఖల కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు-2023 ప్రధానోత్సవ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాహుల్, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి బి. శేషాద్రితో కలిసి జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామ పంచాయతీల సర్పంచ్ లు , పంచాయతీ కార్యదర్శులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డు – 2023లో జిల్లాలో గల 310 గ్రామ పంచాయతీలలో 15 గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీలు ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. జనాభా ప్రాతిపదికన 2 వేల జనాభా కన్నా తక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు-5, 2001 నుండి నుండి 5000 జనాభా ఉన్న గ్రామ పంచాయతీలు-5, 5 వేల కన్నా జనాభా ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు-5లను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఆయా గ్రామాల్లో ప్రతి నివాసంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, తడి చెత్త, పొడి చెత్త ప్రక్రియ నిర్వహణ, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్యం, గోబర్ గ్యాస్ ప్లాంట్, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, వాల్ పెయింటింగ్ లాంటి వివిధ అంశాల ద్వారా మూల్యాంకనం చేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన గ్రామపంచాయతీ రాష్ట్ర స్థాయిలో ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. భీమారం మండలం ఎల్కేశ్వరం, భీమారం, కన్నెపల్లి మండలం వీరాపూర్, లక్షెట్టిపేట మండలం రంగపేట్, తిమ్మాపూర్, వెంకట్రావుపేట, బెల్లంపల్లి మండలం లింగాపూర్, హాజీపూర్ మండలం టీకనపల్లి, నెన్నెల మండలం చిత్తాపూర్, జన్నారం మండలం దేవునిగూడ, మందమర్రి మండలం అందుగులపేట్, వేమనపల్లి మండలం నీల్వాయి, చెన్నూర్ మండలం కిష్టంపేట, కాసిపేట మండలం దేవాపూర్, దండేపల్లి మండలం దండేపల్లి గ్రామ పంచాయతీలు ఎంపిక చేసి సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు అవార్డులు అందించడం జరిగిందని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ అవార్డులను స్ఫూర్తిగా తీసుకొని గ్రామాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని, దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీలుగా నిలిచేలా పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ, సంబంధిత శాఖల అధికారులు, సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుల వివక్ష, అణచివేతల నుండి విముక్తి చేస్తూ అనగారిన వర్గాల ఆశాజ్యోతిగా నిలిచిన రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. గా అంబేద్కర్ జీవిత చరిత్ర ఆదర్శనీయమని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి సారథ్యంలో సంఘం శరణం గచ్చామి వారిచే జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీంరావ్ అంబేద్కర్-మాత రమాబాయి ల జీవిత చరిత్ర నాటక ప్రదర్శన రూపంలో ప్రదర్శించడం జరిగిందని తెలిపారు. అంబేద్కర్ పుట్టినప్పటి నుండి వారి జీవిత ఘట్టాలను కళ్ళ ముందు ఆవిష్కరించి, కుల వివక్షలు, కుల నిర్మూలన, అణగారిన వర్గాలపై జరిగిన ఆకృత్యాలు, వీటన్నింటి నుంచి ప్రజలను విముక్తులను చేసి సర్వ హక్కులు కల్పించిన అంబేద్కర్ చేసిన కృషి అనిర్వచనీయమైనదని తెలిపారు. దళిత సంఘాల నాయకులు ఇలాంటి కార్యక్రమాలు గ్రామ, మండల స్థాయిలో నిర్వహించి ప్రజలలో అవగాహన కల్పించి కుల వివక్షలను తొలగించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల కార్పొరేషన్ ఈ.డి. దుర్గాప్రసాద్, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి రవీందర్, దళిత సంఘాల నాయకులు జిల్లపెల్లి వెంకటేశం, గుడిసెల దశరథం, చెన్నూరి సమ్మయ్య, రాజ మల్లయ్య, జెట్టి చరణ్, మంచి వసతి గృహ సంక్షేమ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సింగరేణి సంస్థ చేపడుతున్న రెండవ దశ 232 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం కోసం హైదరాబాద్ సింగరేణి భవన్ లో మంగళవారం నిర్వహించిన ప్రీ బిడ్ సమావేశానికి దేశవ్యాప్తంగా 10 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. వీటిలో టాటా సోలార్ పవర్ తో పాటు, ఎన్రిచ్ ఎనర్జీ, నోవాస్ గ్రీన్ ఇంజనీరింగ్, ఎర్త్ ఇన్ ప్రాజెక్ట్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని సింగరేణి చేపట్టనున్న 232 మెగావాట్ల సోలార్ ప్లాంట్లల నిర్మాణ విధివిధానాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. సింగరేణి సోలార్ సారథ్య బాధ్యతలు నిర్వహిస్తున్న డైరెక్టర్ (ఈ అండ్ ఎం) డి. సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్ వి కె శ్రీనివాస్, జనరల్ మేనేజర్ (సోలార్) జానకిరామ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ 8 ఏరియాలల్లో చేపట్టనున్న సోలార్ ప్లాంట్ల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. మొత్తం 232 మెగావాట్లకు సంబంధించి మూడు టెండర్లుగా నిర్మాణ ఏజెన్సీలను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. నిర్మాణ ప్రదేశాలను, అక్కడికి గల రవాణా సౌకర్యాలు నిర్మాణ ఏజెన్సీలు స్వయంగా పరిశీలించవచ్చని ఆహ్వానించారు. సింగరేణి సంస్థ ఇప్పటికే తన మొదటి దశ 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లలో 224 మెగావాట్ల ప్లాంట్లలను విజయవంతంగా పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విషయాన్ని ఈ సందార్భంగా సింగరేణి అధికారులు వివరించారు. ఈనెల 25వ తేదీ లోగా టెండర్లు సమర్పించాలని, టెండర్లు ఖరారైన తర్వాత కచ్చితంగా ఏడాదిలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని, నిర్మాణ దశలను బట్టి బిల్లులను ఎప్పటికప్పుడు ఎటువంటి జాప్యం లేకుండా చెల్లించడం జరుగుతుందని సింగరేణి ఆర్థిక విభాగం అధికారులు వివరించారు. సింగరేణి సంస్థకు పని చేయడం ఒక మంచి అవకాశం గా తాము భావిస్తామని ప్రీ బిడ్ కు విచ్చేసిన ఏజెన్సీల వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జనరల్ మేనేజర్ (మెటీరియల్ ప్రొక్యూర్మెంట్) మల్లెల సుబ్బారావు, జనరల్ మేనేజర్ (ఎఫ్ అండ్ ఏ) సుబ్బారావు, జనరల్ మేనేజర్ (వర్క్ షాప్స్) ఫ్రిజరాల్డ్, చీఫ్ ఆఫ్ పవర్ ఎన్.వి.కె.వి.రాజు తదితరులు పాల్గొన్నారు.
భారతదేశంలో ప్రపంచకీరణ పెరిగిన తరువాత గిగా పని సంస్కృతి పెరిగింది. గిగా పని సంస్కృతి లో క్యాబ్ డ్రైవర్స్, జోమోటో, స్విగ్గి, డెలివరీ బాయ్స్, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో పనిచేసే కార్పెంటర్స్, ప్లంబర్స్ లాంటి వారు ఈ కోవకు చెందుతారు. భారతదేశంలో ప్రస్తుతం 1.5 కోట్లకు పైగా గిగ్ వర్కర్లు ఉన్నట్లు అంచనా. వీటిలో డెలివరీ సేవలలో 99 లక్షలు ఉన్నట్లు అంచనా. 2022లో నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, 2029 నాటికి దాదాపు 2.35 కోట్ల మంది కార్మికులు గిగ్ ఎకానమీలో పని చేయనున్నారు. భారతదేశ కార్మిక చట్టాల ప్రకారం గిగ్ కార్మికులు కార్మికులుగా గుర్తించబడరు. వారు “డెలివరీ భాగస్వాములు”, “డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు” మొదలైన పేర్లతో సూచించబడ్డారు. ఇది వారి యజమాని అయిన పెట్టుబడిదారీ సంస్థతో వారి సంబంధం యొక్క నిజమైన దోపిడీ లక్షణాన్ని దాచిపెడుతుంది. వేతనాలపై కోడ్, పారిశ్రామిక సంబంధాలపై కోడ్ మరియు ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్‌పై కోడ్‌లో సూచించిన విధంగా కార్మికులకు వచ్చే అన్ని హక్కుల నుండి గిగ్ వర్కర్లు మినహాయించబడ్డారు. వీటిలో గంటలు, కనీస వేతనాలు, వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్య ప్రయోజనాలు, ఓవర్ టైం వేతనంపై పరిమితి ఉన్నాయి. ఈ యూనియన్లు అధికారికంగా గుర్తించబడనందున, కంపెనీ యజమానులపై లేబర్ కోర్టులలో కేసులు వేయలేనందున కంపెనీ యజమానులు ఏ యూనియన్లతోనూ చర్చలు జరపడానికి నిరాకరిస్తున్నారు. గిగ్ వర్కర్లకు నిర్ణీత పని గంటలు లేవు. వారి పని షెడ్యూల్ సెట్ చేయబడింది, యజమాని కంపెనీల ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఖచ్చితంగా పర్యవేక్షించబడుతుంది. వారి పని గంటలు తరచుగా రోజుకు 12 నుండి 14 గంటల వరకు పొడిగించబడతాయి. ఇది వారికి విశ్రాంతి తీసుకోవడానికి లేదా కుటుంబ సభ్యులతో చాలా తక్కువ సమయం గడుపుతున్నారు. గిగ్ వర్కర్లు తమ సేవలను తక్కువ సమయంలో అందించాలనే ఒత్తిడిలో ఉన్నారు. ప్రత్యేకించి డెలివరీ వర్కర్లు, అలాగే క్యాబ్, ఆటో డ్రైవర్లు నిర్ణీత వ్యవధిలో ట్రిప్పుల సంఖ్యను పెంచుకోవడానికి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తత్ఫలితంగా వారు తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా మారుతుంది. జీవనోపాధికి అభద్రత, స్థిరమైన ఉద్యోగం లేకపోవడం మరియు తగిన, సురక్షితమైన ఆదాయం గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. గిగ్ ఎకానమీలో చాలా మంది డెలివరీ కార్మికుల సగటు ఆదాయాలు సాధారణంగా ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల కంటే తక్కువగా ఉన్నాయి. యాజమాన్య సంస్థలు ప్రారంభంలో అందించిన చాలా ప్రోత్సాహకాలను ఉపసంహరించుకోవడంతో ఇవి కూడా ఇటీవలి సంవత్సరాలలో పడిపోతున్నాయి. యజమాని కంపెనీ వారిని లాభదాయకం కాదని భావించినప్పుడల్లా, వారు క్షణం నోటీసులో వారి ఉద్యోగాల నుండి తొలగించబడవచ్చు. కంపెనీ యజమానులు కార్మికులను రోజుకు 12 నుండి 14 గంటల పాటు కనీస వేతనాలతో పని చేయమని ఒత్తిడి చేయడం కొనసాగించవచ్చు. వారి పని సమయంలో జరిగే ప్రమాదాలకు వైద్య ఖర్చులను తిరస్కరించవచ్చు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా వారిని ఉద్యోగాల నుండి తొలగించవచ్చు. కార్మికులుగా గుర్తింపు లేకుండా, ట్రేడ్ యూనియన్ హక్కులు లేనప్పుడు, గిగ్ కార్మికులు తమ డిమాండ్ల కోసం సమిష్టిగా పోరాడే స్థితిలో లేదా వారి సమస్యలకు ఏదైనా పరిష్కారాన్ని అమలు చేసే స్థితిలో లేరు. గిగ్ ఎకానమీలో చేరిన కార్మికుల సంఖ్య పెరగడంతో, ఇతర రకాల ఉపాధి లేనప్పుడు, కార్మిక సంఘాలు మరియు కార్మికవర్గ సంస్థలు గిగ్ కార్మికులను కార్మికులుగా చట్టబద్ధంగా గుర్తించడం, స్థిర పని వంటి వారి హక్కుల సమస్యలను చేపట్టాలి. గంటలు, సురక్షితమైన పని పరిస్థితులు, కనీస వేతనాలు, ఉద్యోగాల భద్రత, సామాజిక భద్రత, యూనియన్ల ఏర్పాటు హక్కు, ఫిర్యాదుల పరిష్కారానికి యంత్రాంగాలు మొదలైనవి.గిగ్ వర్కర్లు మిగిలిన కార్మికవర్గంతో చేతులు కలపాలి మరియు సంఘటితం చేయడానికి తమ ప్రయత్నాలలో పట్టుదలతో ఉండాలి.గిగ్ కార్మికులకు ఆరోగ్య సంరక్షణ, తగిన ఆదాయం మరియు సామాజిక భద్రతా ప్రయోజనాలు వంటి హక్కులను పొందడం కొరకు కార్మిక సంఘాలు సమిష్టిగా కృషి చేయాలి.
సి.పి.ఆర్.ఎం.ఎస్ (కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్ మెడి కేర్ స్కీం) మెడికల్ కార్డ్ ద్వారా సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు వైద్య సౌకర్యం కల్పించాలని కోరుతూ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా బోడుప్పల్ లోని యుక్త హాస్పిటల్ సీఈఓ శ్రీవల్లికి సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణుమాధవ్ మాట్లాడుతూ బొడుప్పల్,మేడిపల్లి, ఫిర్జాది గూడ చంగిచర్ల పరిసర ప్రాంతాల్లో దాదాపు 500 మంది సింగరేణి విశ్రాంత ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో జీవిసున్నారని, సింగరేణి యాజమాన్యం అందించిన సి.పి.ఆర్.ఎం.ఎస్ మెడికల్ కార్డ్ ఉపయోగించుకోవాలంటే దగ్గర లో ఎంప్యానల్ హాస్పిటల్స్ లేవని తెలిపారు. యుక్త హాస్పిటల్ నందు సి.పి.ఆర్.ఎం.ఎస్ మెడికల్ కార్డ్ ద్వారా వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఆళవందార్ వేణు మాధవ్, సీపీఐ మండల కార్యదర్శి కిషన్ రచ్చ, అసోసియేషన్ నాయకులు భీరయ్య, గీస కనకయ్య, రామ రాజు, సూర్యనారాయణ, చక్రపాణి, లక్ష్మయ్య, ప్రభాకర్, నరేందర్ రెడ్డి, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన నిస్తూ భారత వాతావరణ శాఖ తాజా ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరో 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మయన్మార్ తీరానికి అనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపర్తల ఆవర్తనం ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
మరో రెండు రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన నిస్తూ భారత వాతావరణ శాఖ తాజా ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. మరో 48 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మయన్మార్ తీరానికి అనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉపర్తల ఆవర్తనం ప్రభావంతో ఆ పరిసర ప్రాంతాలపై అల్పపీడనం పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవన ద్రోని కూడా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో.. ఈనెల 15 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది భారత వాతావరణ శాఖ. కోస్తాలో తెలైకపాటి నుంచి మోస్తారు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తాజా వెదర్ బులిటన్లో ఐఎండి పేర్కొంది.