ఆర్.కె న్యూస్, నస్పూర్: విద్యార్థులు పోటీ పరీక్షల్లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి, జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం ఆజాది కా అమృత మహోత్సవ్ ముగింపు వేడుకలు జనరల్ మేనేజర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ సింగరేణి ఉన్నత పాఠశాల, సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు వ్యాసరచన, క్విజ్ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని, ప్రతిభ కనబర్చడం సంతోషకరమని అన్నారు. రాబోవు రోజుల్లో పోటీ పరీక్షల్లో బహుమతులు పొందాలని విద్యార్థులకు జనరల్ మేనేజర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్ గారు, డీజీఎంలు పి. అరవింద్ రావు చిరంజీవులు, ఏరియా రక్షణాధికారి శ్రీధర్ రావు, సీనియర్ పిఓ పి. కాంతారావు, సింగరేణి పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణమూర్తి, పాఠశాల పిఈటి హేమ, పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
19 September 2023
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: వృత్తి నైపుణ్యం పొందిన మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి అన్నారు. మంగళవారం మంచిర్యాల పట్టణంలోని ఆండాళమ్మ కాలనీలో వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ నేర్చుకున్న మహిళలకు స్వయం ఉపాధి కుటీర పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ వివిధ రంగాల్లో వృత్తి నైపుణ్యం సాధించిన మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు కుటీర పరిశ్రమలు స్థాపించేందుకు జిల్లాలోని వివిధ బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయంగా తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించడం జరుగుతుందని, మహిళలు ఉపాధి పొందడమే కాకుండా ఇతర ప్రాంతాలలోని మహిళలకు ఆదర్శకంగా నిలిచి స్ఫూర్తి పొందేలా అవగాహన కల్పించాలని తెలిపారు. మహిళా సాధికారికత సాధ్యమైనప్పుడే కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వయోజనవిద్యా శాఖ ఇన్చార్జ్ అధికారి ఎ. పురుషోత్తంనాయక్, డి.ఆర్.పి.లు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: తెలంగాణ వైద్య విధాన పరిషత్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన అధికారి కార్యాలయం పరిధిలో ఒప్పంద, పొరుగు సేవల పద్దతిలో అందిన దరఖాస్తులను పరిశీలించి ఆన్ లైన్ లో, జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం నోటీసు బోర్డులో ప్రదర్శించిన ప్రాథమిక మెరిట్ జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వ్రాత పూర్వకంగా తెలియజేయాలని జిల్లా ఆసుపత్రుల పర్యవేక్షకులు డాక్టర్ అరవింద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒప్పంద పద్దతిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, పొరుగు సేవల పద్ధతిలో సి.టి. స్కాన్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ గ్రేడ్-2, థియేటర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరగా వచ్చి దరఖాస్తులలో ప్రాథమిక మెరిట్ జాబితాను ఆన్ లైన్ లో https://mancherial.telangana.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ.టి.ఐ.) కళాశాల ఆవరణలో గల జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 21న మినీ జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి కౌశిక్ వెంకటరమణ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ కు చెందిన వైర్ వాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో హైదరాబాద్ లో పని చేయుటకు 15 జూనియర్ ఫెన్సింగ్ టెక్నీషియన్, 15 అప్రెంటిస్ కొరకు కొరకు మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, ఐ.టి.ఐ. ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్ అర్హత కలిగి ఉండాలని, 20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుష అభ్యర్థులు సకాలంలో హాజరై జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 73865 55897, 9573695943, 9111731173లలో సంప్రదించాలని తెలిపారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో వాడవాడల గణనాథులు కొలువు తీరారు. సోమవారం ఉదయం నుండి కాలనీలల్లో సంబరాలు మొదలయ్యాయి. విఘ్నేశ్వరునికి తిరోక్క పూలు, నైవేద్యం సమర్పించి భక్తితో కొలుస్తున్నారు. వినాయక మండపాలు రంగురంగుల అలంకరణతో, చిన్నపిల్లల ఆటపాటలతో కన్నుల పండుగగా ఉన్నాయి.
ఆర్.కె న్యూస్, మంచిర్యాల: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన ఆరు పథకాల హామీ పత్రాల కార్డులను సోమవారం మంచిర్యాల పట్టణంలోని రాజీవ్ నగర్, హాజీపూర్ మండలం వేంపల్లిలో మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, త్రిపుర సీఎల్పీ నాయకుడు, సిడబ్ల్యుసి సభ్యులు సుదీప్ రాయ్ బర్మాన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ స్థానికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియాగాంధీ ఇటీవల తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న ఆరు పథకాలను ప్రకటించారని తెలిపారు. సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రకటించిన అభయహస్తం పథకాలలో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత, యువ వికాసం పథకాలు ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సామాన్యులకు నిత్యవసర సరుకుల ధరలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణ పథకాన్ని రూపొందించినట్లు వారు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వినాయక చవితి ఉత్సవాల్లో డీజే వాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నూర్ రూరల్ సీఐ విద్యాసాగర్ తెలిపారు. కోటపల్లి మండల కేంద్రంలోని డీజే నిర్వాహకులకు పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ నిర్వహించారు. పోలీస్ శాఖ నిబంధనల మేరకు వినాయక చవితి ఉత్సవాల్లో డీజేను అనుమతి లేదన్నారు. ఎక్కడైనా డీజే నిర్వహించినట్లు తమ దృష్టికి వస్తే డీజే సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముందస్తు చర్యలలో భాగంగా వారిని తాసిల్దార్ ఎదుట బైండోవర్ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి ఎస్సై సురేష్ పాల్గొన్నారు.