ఆర్.కె న్యూస్, కుమురంభీమ్ ఆసిఫాబాద్: గర్భిణులకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గర్భం దాల్చిన మహిళలు తమ వివరాలు నమోదు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని, గర్భం దాల్చిన మహిళల వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, గర్భిణులలో రిస్క్ కేసుల వివరాలను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రక్తహీనత లోపం గల గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలను గుర్తించి వారికి సకాలంలో పోషకాహారం అందేలా న్యూట్రిషన్ కిట్ల పంపిణీకి వివరాలు నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు బాలింతలకు అందించే కేసిఆర్ కిట్ల వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేయాలని తెలిపారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులకు, బాలింతలకు అందించే పోషకాహారం వివరాలను ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, వైద్య ఆరోగ్యశాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మహిళల సంక్షేమం దిశగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తుకారాం, జిల్లా సంక్షేమ అధికారి సావిత్రి సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
20 September 2023
ఆర్.కె న్యూస్, నస్పూర్: ప్రభుత్వ భూములలో గత ఏండ్లుగా నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న వారికి ప్రభుత్వ ఉత్తర్వులు 59 ప్రకారం భూముల క్రమబద్ధీకరణ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అర్హత గల వారు సద్వినియోగం చేసుకొని యాజమాన్య హక్కు పొందాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న జి.ఓ. నం.59 క్రింద అభ్యంతరం లేని ఆక్రమిత ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ విచారణ సర్వేను ప్రత్యేక అధికారి కె. చిన్నయ్యతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూములలో నివాసం ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న వారికి అట్టి భూమిపై యాజమాన్య హక్కు కల్పిస్తూ ప్రభుత్వం అందించిన జి. ఓ. 59 సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దరఖాస్తు చేసుకొని నోటీసు పొందిన వారు ప్రభుత్వం నిర్ణయించిన రుసుము చెల్లించి పట్టా పొందాలని తెలిపారు. సామాన్యులకు అందుబాటు ధరలో ప్రభుత్వ ఉత్తర్వులు 59 ప్రకారం రుసుము నిర్ణయించడం జరిగిందని, ఇది ప్రజలకు సువర్ణ అవకాశం అని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకొని లబ్ధి పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
2వ ఓటరు జాబితా సంక్లిప్త పునరీక్షణ కార్యక్రమం-2023లో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో సవరణలు, తొలగింపుల కొరకు అందిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసి స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లాలోని మంచిర్యాల రాజస్వ మండల అధికారి కార్యాలయం, మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయాలను ఆకస్మిక తనిఖీ చేసి మంచిర్యాల నియోజకవర్గ పరిధిలో ఫారం-6, 7, 8 ద్వారా అందిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 2వ ఓటరు జాబితా సంక్లిప్త పునరీక్షణ కార్యక్రమం లో భాగంగా నూతన ఓటరు నమోదు, ఓటరు జాబితాలో మార్పులు, సవరణలు, తొలగింపుల కొరకు ఈ నెల 19వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి ఈనెల 28వ తేదీన అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించడం జరుగుతుందని, అక్టోబర్ 1వ తేదీన తుది జాబితా ప్రచురణ కొరకు ఎన్నికల సంఘం అనుమతి పొంది 4వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. స్పష్టమైన జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ద్వారా నియమించబడిన ఏజెంట్ల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మండల తహసీల్దార్ భోజన్న, రాజస్వ మండల అధికారి కార్యాలయం డి ఏ ఓ జోస్న సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఆర్.కె న్యూస్, నస్పూర్: సింగరేణి ఉద్యోగుల సంక్షేమంతో పాటు వైద్య సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం యాజమాన్యం ప్రాధాన్యత ఇస్తుందని శ్రీరాంపూర్ జీఎం బి. సంజీవ రెడ్డి అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె-8 డిస్పెన్సరీలో 3 లక్షల రూపాయల విలువ గల రెండు నూతన అల్ట్రా మోడల్ లేటెస్ట్ ఈసీజీ పరికరాలను జీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంలో భాగంగా అవరసమైన నూతన వైద్య పరికరాలు సమకూర్చడంలో సింగరేణి సంస్థ ముందుంటుందని అన్నారు. ఉద్యోగులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం (ఫైనాన్స్) మురళీధర్, డివైసీఎంఓ డాక్టర్ పి రమేష్ బాబు, క్వాలిటీ మేనేజర్ కె వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ వేద వ్యాస్, డాక్టర్ మురళీధర్, డాక్టర్ లోక్ నాథ్ రెడ్డి, డాక్టర్ స్వప్న, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.